అమృత వర్షం కురిసెనుగాఆనందం విరిసెనుగా
ప్రేమపుష్పం వికసించునుగా
గువ్వలరాగం వినిపించునుగా
గజ్జెలు సవ్వడి చేయునుగా
గుండెలో అలజడి మ్రోగెనుగా "అమృత "
సంధ్యా తారలు నవ్వెనుగా
సరదా పాటలు పాడెనుగా
గుడిలో గంటలు మ్రోగెనుగా
ఎద లో లయలు మీటెనుగా
చిన్నారి పాప మురిసెనుగా
చలాకి వయసు ఆడెనుగా "అమృత "
వసంత రాగమే మధురంగా
మయూరి నాట్యమే అందంగా
సన్నాయి మేళమే చిత్రంగా
కళ్యాణ ప్రాప్తికి మంత్రంగా
ఇరువురి మనసుల బంధంగా
ఇది ఒక జీవన సూత్రంగా "అమృత"
ముత్యాల తోట లో మురిపెంగా
ముచ్చటైన ఆశ తో మౌనంగా
నీలి మబ్బు నీడలో నిత్యంగా
నమ్ముకున్న ఆశలే సత్యంగా
పారాణి వర్ణాలే సాక్ష్యంగా
కోరుకున్న క్షణాలే లగ్నంగా "అమృత"

